నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 10:25

Rahul Gandhi: అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్‌ ప్రసంగం..!

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాల కూటమి(I.N.D.I.A.) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No-Confidence motion)పై బుధవారం కాంగ్రెస్‌ పార్టీలోని కీలక నేతలు ప్రసంగించనున్నారు.

నేడు పార్టీ తరఫున గళం విప్పేందుకు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), రేవంత్‌ రెడ్డి, హిబి ఇడన్‌ పేర్లను పంపినట్లు పార్టీకి చెందిన మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.

పరిస్థితులను బట్టి ప్రసంగాల క్రమంలో మార్పులు ఉండొచ్చని వెల్లడించారు.

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆయన పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించనున్నారు.

దీంతో ప్రభుత్వాన్ని ఆయన ఏవిధంగా ఇరుకున పెడతారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. వాస్తవానికి రాహుల్‌ నిన్ననే ప్రసంగిస్తారని ప్రచారం జరిగినా.. అది వాయిదాపడింది..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 10:11

ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు... ఏఐ టూల్‌కిట్‌తో గుర్తింపు..

విజయవాడ నగరంలో ఒకే వ్యక్తికి ఏకంగా 658 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని ఏఐ టూల్ కిట్ ద్వారా టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించి, విచారణకు ఆదేశించింది.

అలాగే అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 సిమ్ కార్డులు జారీ అయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే,

విజయవాడ నగరంలోని గుణదలలో ఒక వ్యక్తికి 658 సిమ్ కార్డులు జారీ కావడంతో టెలికమ్యూనికేషన్ అప్రమత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒకే ఫోటోతే, ఒకే నెట్‌వర్క్‌కు చెందిన ఈ సిమ్ కార్డులను విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు.

అలాగే, అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనూ మరో 150 వరకు సిమ్ కార్డులు, నకిలీ పత్రాలతో జారీ అయినట్టు గుర్తించారు. వీటిని ఏఐ టూల్‌కిట్‌ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ శాఖ గుర్తించింది. ఒకే ఫోటోతో జారీ అయిన సిమ్ కార్డులు ఎక్కడికి వెళ్లాయి. వాటిని ఎవరు, ఎందుకోసం వినియోగిస్తున్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 09:33

తండ్రి మందు కొట్టాడు.. కుమారుడు విమానం నడిపాడు.. కూలిపోయింది..

బ్రెజిల్‌లో ఓ విమానం కూలిపోయింది. ఇందుకు కారణం 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపడమే. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా తండ్రి పక్క సీట్లో బీర్ తాగినట్టు కనిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా అనే విషయాన్ని తేల్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

విమానంలో తండ్రీకొడుకులు గారాన్ మాయా, కుమారుడు ఫ్రాసిస్కో మాయాతో రాండోనియా నగరం నుంచి బయలుదేరారు.

మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు. ఆ తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి వద్ద దిపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే ఆత్మహత్య చేసుకుంది.

నిజంనిప్పులాంటిది

Aug 09 2023, 09:31

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 09

తిరుమలలో భక్తుల రద్దీ నేడు బుధవారం కొనసాగుతోంది.

స్వామివారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని మంగళవారం 73,879 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 11:35

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం..

మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై చూపండి..

ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడ్డారు: చిరంజీవి..

ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టండి: చిరంజీవి

ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టండి: చిరంజీవి

ఉద్యోగ, ఉపాధిపై దృష్టి పెట్టినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు: చిరంజీవి

వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 11:28

No-Confidence Debate: 'అవిశ్వాసం'పై చర్చ.. అధికార, విపక్షాల నుంచి మాట్లాడేది వీరే..

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి 'ఇండియా' లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై చర్చ ప్రారంభం..

12 గంటలకు అవిశ్వాస తీర్మానంపై డిబేట్‌ మొదలుపెట్టనున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు చర్చకు సిద్ధమయ్యాయి.

అటు ప్రధాని మోదీ (Modi) నేతృత్వంలో భాజపా (BJP) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అవిశ్వాసంపై ఎలా స్పందించాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. మరోవైపు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో విపక్ష కూటమి 'ఇండియా (India)' నేతలు సమావేశమయ్యారు..

చర్చ రాహుల్‌తో ప్రారంభం..

విపక్ష కూటమి 'ఇండియా' తరఫున చర్చను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీలు గౌరవ్‌ గొగొయ్‌, మనీశ్ తివారీ, దీపక్‌ బైజ్‌, అధిర్‌ రంజన్‌ చౌధరీ, బెన్నీ బెహనాన్‌, హిబి ఈడెన్‌, టీఎన్‌ ప్రతాపన్‌, డీన్‌ కురియకోస్‌ చర్చలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి..

ఇక అధికార పక్షం తరఫున ఐదుగురు మంత్రులు, ఐదుగురు ఎంపీలు అవిశ్వాసంపై సమాధానమివ్వనున్నట్లు తెలుస్తోంది. భాజపా తరఫున నిషికాంత్‌ దూబే చర్చను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్‌ రిజిజు చర్చలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9న అమిత్‌షా సమాధానమివ్వనున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ ఇచ్చిన ఈ అవిశ్వాస తీర్మానంపై గురువారం వరకూ 3 రోజులపాటు చర్చ జరగనుంది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ సమాధానమిస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఓటింగ్‌ జరుగుతుంది..

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 11:25

పేలిన పెట్రోల్‌ బంక్‌.. ఎగసిపడిన మంటలు

తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు..

వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్‌ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు.

అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది.

ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది.

అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 11:11

రాష్ట్రంలో 71 శాతం మంది యువ, మహిళా ఓటర్లే

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం ఈసీ, ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం..

ఆ సంఖ్య 2.99 కోట్లకు చేరింది. మొత్తం ఓటర్లలో 2.12 కోట్లు (71 శాతం) మహిళలు, యువ ఓటర్లే ఉండటం గమనార్హం.

ఈసీ గణాంకాల ప్రకారం.. మొత్తం ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు ఉన్నవారు ప్రస్తుత ఓటరు జాబితా ప్రకారం 2.78 లక్షలు ఉన్నారు.

గత జనవరిలో ప్రకటించిన తుది ఓటరు జాబితాలో వివిధ కారణాలతో 2.72 లక్షల మంది ఓటర్లను తొలగించారు.

6.84 లక్షల మందిని కొత్తగా చేర్చారు. ఈ మేరకు రాష్ట్రంలో 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2023 అక్టోబర్‌లో ప్రకటించే తుది జాబితా ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు...

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 09:31

నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :ఆగస్టు 08

సర్వసాధారణంగా తిరుమలలో వీక్‌ డేస్‌లో భక్తుల రద్దీ తక్కువగానూ.. వీకెండ్‌లో భక్తులరద్దీ ఎక్కువగాను ఉంటుంది. కానీ ఈ రోజు వీక్ డేస్‌లోనూ భక్తుల రద్దీ కొననసాగుతోంది.

నేడు మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

ఇక సోమవారం స్వామివారిని 69,733 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28,614 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు...

నిజంనిప్పులాంటిది

Aug 08 2023, 08:39

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..నేడు చర్చ ప్రారంభం..

న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం కానుంది..

మణిపుర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు.

బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టింది..

గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్.. సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అధికార పార్టీ ఎంపీలు మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు సమయం ఇస్తారు..